కందగడ్డను ఎలా పెంచుకోవాలి
కందగడ్డను ఎలా పెంచుకోవాలి తెలుసుకుందాం..
అన్ని రకాల దుంపలు పెరిగినట్లు కంద కూడా భూగర్భంలో పెరిగే కండగలిగిన మొక్క..
కందను కూడా మిద్దెతోటలో సులభంగా పెంచుకోవచ్చు..
ఇది ఉష్ణమండల పంట..
తేమ మరియు వెచ్చని వాతావరణంలో బాగా పెరుగుతుంది..
సాధారణంగా వర్షాధార పరిస్థితులలో దీనిని పండిస్తారు..
సారవంతమైన మట్టిలో కందమొక్క బాగా పెరుగుతుంది..
దీనిని దుంప ద్వారా పెంచుతారు..
మట్టిలో ఫార్మ్ యార్డ్ ఎరువు,కలప బూడిద కలపాలి..
వంద గ్రా పరిమాణంలో కంద దుంపలను కట్ చేసి మట్టిలో నాటాలి..
దుంపలను మట్టిలో నిలువుగా ఉంచాలి..
దుంపలను నాటిన తర్వాత మట్టిలో తేమ ఉండేలా చూసుకోవాలి..
తీగ జాతి కూరగాయల కుండీలలో అంతర పంటగా కూడా సాగు చేయవచ్చు..
వర్షాధార పరిస్థితులలో కందను సాగుచేస్తారు..
అలా కాకుండా మిగతా కాలాల్లో కందను సాగుచేయాలంటే మంచి నీటిపారుదల అవసరం..
అప్పుడప్పుడు ఎరువులు ఇస్తూ ఉండాలి..
కందలో వచ్చే ప్రధాన వ్యాధులు..
ఆకుమచ్చ,కాలర్ రాట్ తెగులు..
ఈ తెగుళ్ళు ఫంగస్ వల్ల వస్తాయి..
ఆకుమచ్చ నివారణకు బేకింగ్ సోడా ద్రావణం కానీ,పుల్ల మజ్జిగ,ఇంగువ ద్రావణాన్ని కానీ, వేపనూనె కానీ,కాపర్ ఆక్సీ క్లోరైడ్ ను కానీ పిచికారి చేయాలి..
కాలర్ రాట్ తెగులు మట్టిలో పుట్టే ఫంగస్ వల్ల వస్తుంది..
మట్టిలో వేప పిండి వేయాలి..
ట్రైకోడెర్మా ను ఎరువుతో కలిపి వేయాలి..
కుండీలలో నీరు నిలబడకుండా చూసుకోవాలి..
ఏడు నుంచి తొమ్మిది నెలలలో పంట సిద్ధంగా ఉంటుంది..
మొక్క కాండం, ఆకులు ఎండిపోయినప్పుడు పంట సిద్ధంగా ఉందని గుర్తించవచ్చు...
కందను తవ్వి తీసిన తరువాత మట్టితో అలాగే ఉంచాలి..
అప్పుడే కందగడ్డ చాలా కాలం నిలువ ఉంటుంది..
ఈవిధంగా కందగడ్డను మిద్దె తోట లో కూడా పెంచుకోవచ్చు.
ఇట్లు
లత
Leave your comment