మిద్దె తోట - ఆరోగ్యం - ఆవశ్యకత
మిద్దె తోట - ఆరోగ్యం - ఆవశ్యకత
ఉమ్మడి కుటుంబాల నుండి చిన్న కుటుంబాలు జనాభా పెరుగుదల చిన్న నివాసాలు బహుళ అంతస్థుల నిర్మాణాలతో మొక్కల పెరుగుదలకు ఆటంకం పెరుగుతున్నది.
పాత తరం సేంద్రియ పెరటి తోటల నిర్వహణ కనుమరుగై రసాయన పంటల మీద ఆధారపడి ఏ రుగ్మతలు ఎందుకు వస్తున్నాయో అర్ధం కాకా సతమతమవుతున్నారు.
తెలివైన మనిషి ఆరోగ్య సముపార్జనలో భాగంగా సేంద్రియ విధానాల తో పెరటి తోటల పెంపకానికి శ్రీకారం చుట్టాడు.ఆకు కూరలు, కాయగూరలు, పూలు, పండ్లు సైతం మిద్దె మీద పండించటం మొదలు పెట్టాడు. కుటుంబ ఆహరం అవసరాలకు తను స్వామ్యం గ సేంద్రియ విధానం లో పండించి ఆరోగ్యం ఆనందం పొందుతున్నాడు. ఈ విధానాలు భారత దేశం లోనే కాక విదేశాలలో వున్న భారతీయులు సైతం ఆచరించి ఆదర్శం గా నిలుస్తున్నారు. దీని వలన శరీరానికి వ్యాయామం సమకూరటమే కాక కొంత ఆర్ధిక వెసులుబాటు కూడా కలిగి ఆరోగ్యం తో కూడిన తృప్తి ని పొందుతున్నారు. తృప్తి కి మించిన సంపద లేదు కదా!.
నగరాలలో మిద్దె తోట సాగు దారులు సంఘాలుగా ( ఏర్పడి) పంటలు మొక్కలు వింతను మార్పిడి చేసుకుంటూ తమ నైపుణ్యాలను మిత్రులకు తెలియ చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేక గౌరవాన్ని గుర్తింపు ను పొందుతున్నారు. అనేక చోట్ల సేంద్రియ పంటల గురించి సదస్సులు ప్రదర్శిస్తూ ప్రజలను చైతన్య పరచటం ఎంతైనా ముదావహం (అభినందనీయం) . సేంద్రియ పంటలను పండించే రైతులను ప్రోత్సహించవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని మనం మరువ కూడదు. సేంద్రియ విందనాలను ప్రోత్సహించటం తో పాటు వాటిని వినియోగించటం వలన కుటుంబం ఆరోగ్యం గా ఉంటుంది. అనవసరమైన వైద్య ఖర్చులు భారం తప్పుతుంది.
మిద్దె తోట నిర్వహణ :
మిద్దె తోట ఏర్పాటులో మొదటగా బిల్డింగ్ స్లాబ్ అనుకూలం గా ఉన్నదా లేదా అని పరిశీలించుకుని తేలిక పాటి కుండీలు గ్రో బాగ్స్ ఏర్పాటు చేస్కుని కుండీలను కుండీల స్టాండ్ల మీద అమర్చుకుని సాగు ప్రారంభించాలి. అన్ని రకాల ఆకుకూరలు , కూరగాయలు, పూలు, పండ్ల చెట్లను మిద్దె మీద సాగు చేసుకోవచ్చు.
మొక్కల కోసం 6 - 7 గంటలు ఎండ తగిలే విధం గా ఉంటేనే అవి బాగా పెరుగుతాయి. వారం వారం మిద్దె తోటలను శుభ్రం గా ఉంచుకోవటం స్లాబు పైన నీరు నిలువకుండ చూసుకోవటం ముఖ్యం
ఎండాకాలం లో షేడ్ నెట్స్ ఏర్పాటు చేసుకోవటం వలన మొక్కలు పాడవకుండా కాపాడుకోవచ్చు
వేసవి కాలం లో మొక్కలకు ఉదయం నీరు అందించాలి. ఒక చదరపు మీటరు స్లాబ్ కి సుమారు 250KG బరువు మోస్తుంది. స్లాబ్ పగలకుండా చూసుకోవాలి. బరువైన కుండీలు పిల్లర్స్ కి దగ్గర గా అమర్చుకోవాలి. మేలైన విత్తనాలు ఎంపిక మరియు సారవంతమైన మట్టి , పాటింగ్ మిక్స్ , కంపోస్ట్ లు అధిక దిగుబడి అందిస్తాయి. ముఖ్యం గా పంటల సశ్య రక్షణ చర్యలు సకాలం లో చేపట్టాలి. ప్రతి రోజు మొక్కలను పరిశీలించటం చెయ్యాలి. స్థానికం గా మిద్దె తోట పెంపకం చేపట్టే తోటి మిత్రులతో తరచుగా సంప్రదిస్తూ మీ నైపుణ్యాన్ని పెంచుకోండి. మీ ఆరోగ్యానికి మీరే కర్తలని గ్రహించండి.
పట్టణ వ్యవసాయం (అర్బన్ ఫార్మింగ్) వలన ఉపయోగాలు:
మొక్కల వలన ఇంటితో పాటు పరిసరాల ఉష్ణోగ్రత తగ్గి ఎయిర్ కండీషనర్ ల అవసరం తగ్గుతుంది
రుచికరమైన ఆహరం అందుబాటులో వుండి తక్కువ వనరులతో మనకు కావాల్సిన ఆహారాన్ని పండించుకోవచ్చును. పట్టణ వ్యవసాయం వలన ఇంటి వ్యర్ధాలను కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ గా మార్చి తిరిగి మన పంటలు పండించుకోవటం వలన ఖర్చులు ఆదా అవుతుంది మరియు పచ్చదనం పెంపొందడం వలన వాతావరణ కాలుష్యం గణనీయం గా తగ్గడం తో పాటు ఆక్సిజన్ లభిస్తుంది.
మన కుటుంబం ఆరోగ్యం మనం తీసుకునే ఆహరం పై ఆధారపడి ఉంటుంది. సేంద్రియం గా మనం స్వయం గా పండించే పంటల వలన కుటుంబ ఆరోగ్యానికి భద్రత ఉంటుంది. '
-----అమృత తుల్యమైన సేంద్రియ పంటలను మీ నివాసాలలోనే పండించుకుని పది కాలాల పాటు ఆరోగ్యం గా వుండండి అందరిని ఆరోగ్యం గా ఉండేలా చూడండి.------
సంక్షిప్తం గా నాకు నేను గా కుటుంబ సభ్యుల సహకారం తో 1990 సంవత్సరం లో దేవకాంచన మొక్కలు పెంచి వాటి పంపిణితో ప్రారంభమైన పర్యావరణ సేవ 30 సంవత్సరాలు గా మొక్కలు ఉచితం గా పంపిణి చేస్తూనే వున్నాను. ఇప్పటికి సుమారుగా 3 లక్షల మొక్కలు పంపిణి చేయటం జరిగింది. అంతే కాకుండా పెద్ద వృక్షాలను సైతం వున్న చోట నుంచి అవసరమైన చోటుకి తరలించి సజీవం గా నిలపటం కూడా చేస్తున్నాను. మానవాళికి అవసరమైన నీరు మరియు పర్యావరణానికి అవసరమైన పచ్చని చెట్లు నా సేవకు ప్రధాన అంశాలు గా ఎంచుకున్నాను.
నీరు లేకపోతే ఏ జీవికి మనుగడ లేదని తలచి 1998 సంవత్సరం వుండి వాన నీటి మదుపు - పొదుపు (రైన్ వాటర్ హార్వెస్టింగ్) అంశాన్ని ఇంటింటా ప్రచారం చేస్తూ ప్రతి ఇంటికి ఇంకుడు గుంట ఏర్పాటుతో వాన నీటిని భూమి పొరలలో భద్రపరుచుకున్ని తిరిగి మరలా వాడుకునే విధం గా కరపత్రాలు, పుస్తకాలు రేడియో టీవీ పత్రికల ద్వారా ప్రచారం కల్పించి వేలాది ఇంకుడు గుంటలు నిర్మించటం జరిగింది. ఈ నేపధ్యం లో గుంటూరు నగరపాలక సంస్థ వారు నన్ను గుంటూరు నగర పట్టణానికి ఇంకుడు గుంటల పర్యవేక్షణ కు అధికారికం గా నియమించారు.
మొక్కలు పెంపకం, మిద్దె తోటల సాగును ప్రోత్సహించే క్రమంలో గుంటూరు కేంద్రం గా "మన ఇంట సేంద్రియ పంట" గ్రూపుని ఏర్పాటు చేసి విత్తన మార్పిడి తో పాటు విగణాన్ని కూడా ఇచ్చిపుచ్చుకునే సేవాకార్యక్రమం నిరంతరం జరుగుతూనే ఉంటుంది.
మీ మీ ప్రదేశాలలో ఏ కొద్దీ పాటి స్థలం వున్నా సేంద్రియ పద్దతిలో సాగు చేయమని మనవి చేస్తున్నాను. అది మనకే కాకుండా మీ ముందు తరాలకి కూడా ఆరోగ్యం ఆనందం సమకూర్చి పెడుతుంది.
-------కుటుంబ ఆరోగ్యమే సమాజ ఆరోగ్యం. ఆరోగ్యమే మహా భాగ్యం-------
మీకు అవసరమైన సలహాలు సూచనల కోసం సంప్రదించవలసిన చిరునామా
చెలికాని సీతారామయ్య
CSR ORGANICS
D No 5-62-191,opp.Harica Enclave, near Saibaba temple, 6/19 Brodipet,
Raghavendra Swamy temple street, Guntur-522 002.
Mobile: 988 522 9289 / 949 949 3333
Leave your comment